రోడ్ల పక్కన నివసించే నిరాశ్రయులకు ‘స్కై ఫౌండేషన్’ దుస్తుల పంపిణీ

హైదరాబాద్, మే 17, (జే ఎస్ డి ఎం న్యూస్) :
నగరంలోని రోడ్ల పక్కన, ఫుట్‌పాత్‌లపై అత్యంత దీనస్థితిలో జీవనం సాగిస్తున్న అనాథలు, నిరాశ్రయులు, సంచార జాతుల కుటుంబాలను ఆదుకునేందుకు స్కై ఫౌండేషన్ మానవత్వంతో ముందుకు వచ్చింది. ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని పలు ప్రాంతాల్లో ఉన్న నిరాశ్రయులను గుర్తించి, వారికి అవసరమైన దుస్తులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా స్కై ఫౌండేషన్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ డాక్టర్ వై. సంజీవ కుమార్, వైస్ ప్రెసిడెంట్ ఓ. పావని మాట్లాడుతూ.సమాజంలో నిరుపేదలు, అవసరంలో ఉన్న వారికి తోడుగా నిలవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని
పిలుపునిచ్చారు. ఎలాంటి ఆసరా లేక రోడ్లపై కాలం వెళ్లదీస్తున్న వారికి తమ వంతు సాయంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. నిరాశ్రయుల ముఖాల్లో ఆనందం చూడటమే తమ సంస్థ ముఖ్య ఉద్దేశమని పేర్కొంటూ, ఈ కార్యక్రమానికి సహకరించిన వారందరికీ డాక్టర్ సంజీవ కుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *