ప్రకృతి వైపరీత్యాలను ఆపలేమని ముందు జాగ్రత్తతో నష్టాలు తగ్గించుకోవచ్చని వ్యవసాయాధికారి ప్రసాద రావు అన్నారు. తాళ్లూరు మండలంలో 65శాతం పైగా వర్షాధార పంటలు వేసుకోవాలని చెప్పారు. సూపర్ ఎల్ నిలో ప్రభావం వలన నైరుతి రుతు పవనాలు ప్రారంభం ఆలస్యం అవుతుందనని చెప్పారు. వర్షపాతం 36శాతం సాధారణం కంటే తక్కువగా ఉంటుందని అన్నారు. ఖరీఫ్ పంటలైన వరి, మొక్కజొన్న, పప్పుధాన్యాలు గడ్డు పరిస్థితులను ఎదుర్కోంటుందని తెలిపారు. నీటి పొదుపు, పంటల ప్రణాళికలు మార్పు చేసుకోవటం చాలా ముఖ్యమని రాబోవు కాలంలో పర్యావరణ పరిరక్షణ సూపర్ ఎల్నిలో నుండి మనల్ని కాపాడే ఎకైక ఆయుధమని వివరించారు.
