ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో పొగాకు ఎక్కవగా పండించిన కారణంగా రైతులు మార్కేట్ డిమాండ్ ధరలను గమనించి అందుకు అనుగుణంగా మార్కేట్కు పొగాకు ను తీసుకురావాలని ఒంగోలు–2 పొగాకు వేలం బోర్డు నిర్వాహణాధికారి జె తులసి చెప్పారు. బోర్డులో సోమవారం రైతులతో సమావేశం నిర్వహించారు. వేలం నిర్వాహణాధికారి జె తులసి మాట్లాడుతూ మార్కేట్లో ప్రస్తుతం లేమన్ ఆరేంజ్ స్టైల్ మరియు గట్టి మాడు పొగాకు కు మంచి డిమాండ్ ఉందని చెప్పారు. అందుకు అనుగుణంగా రైతులు నాణ్యత కలిగిన పొగాకు ను మరియు బల్క్ అయిన పొగాకు ను మార్కేట్కు తీసుకు రావటం వలన రిజెక్షన్స్ తగ్గించవచ్చని చెప్పారు. గ్రెడింగ్ విషయంలో కూడ రైతులు జాగ్రత్త వహించాలని కోరారు. వచ్చే నెల నుండి కంపెనీల కొత్త కంపెనీలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. రైతులు కంగారు పడి తక్కువ ధరకు అమ్ముకోవద్దని తెలిపారు. రైతులు పచ్చి రొట్ట ఎరువుల వైపు మొగ్గు చూపాలని కోరారు. దాని వలన భూమిలో సహజ సిద్దమైన సెంద్రీయ కర్బనం మరియు నత్రజని అందుతాయని చెప్పారు. రైతులకు ఎరువుల ఖర్చు తగ్గుతుందని, పొగాకు నాణ్యత పెరుగు తుందని తెలిపారు. కంపెనీ ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.
