తాళ్లూరు మండలంలో మొదటి తరం విద్యాధికులతో ఒకరైన ఐసీ కోటి రెడ్డి సంస్మరణ
దినోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బా రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి, వైసీపీ నాయకులు అద్దంకి ఎఎంసీ మాజీ చైర్మన్ వైవీ భద్రా రెడ్డి, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోశం మధుసూధన రెడ్డి, ఐవీ సుబ్బా రెడ్డి, ముండ్లమూరు ఎంపీపీ ఎస్ ఎస్ బ్రహ్మా రెడ్డి, పార్టీ అధ్యక్షుడు టీవీ సుబ్బారెడ్డి, పార్టీ కార్యదర్శి మారం ఇంద్రసేనా రెడ్డి, పులి బ్రహ్మా రెడ్డి, కోట క్రిష్ణా రెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంపీటీసీ యామర్తి ప్రభుదాన్, స్టూడెంట్ వింగ్ అధ్యక్షుడు కైపు అశోక్ రెడ్డి తదితరులు పాల్గొని ఐసీ కోటి రెడ్డి చిత్ర పటానికి నివాళులు అర్పించారు. ఆయన కుమారుడు ప్రముఖ కాంట్రాక్టర్ ఐవీ రెడ్డి (పూనే) కి, ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తాళ్లూరు మండలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలలో తనదైన ముద్ర వేసారని, కళాశాల ఏర్పాటు, గ్రంధాలయం, విద్యుత్ సబ్ స్టేషన్ ఇతర ప్రభుత్వ శాఖల ఏర్పాటులో గ్రామంలో మిగిలిన పెద్దలతో కలిసి దిశా నిర్దేశం చేసారని, వృద్ధాప్యంలో సైతం రుద్రభూమి అభివృద్ధికి కృషి చేసారని ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.



