సికింద్రాబాద్, జులై 2,(జే ఎస్ డి ఎం న్యూస్) : పద్మారావు నగర్ జ్యోతి మెడికల్ హాల్‌లో జరిగిన సంచలన సాయుధ దోపిడీ కేసును చిలకలగూడ పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. ఈ ఆపరేషన్‌లో కీలక పాత్ర పోషించిన పోలీస్ అధికారుల వివరాలను ఉన్నతాధికారులు వెల్లడించారు. సికింద్రాబాద్ జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) శ్రీమతి రక్షితా కృష్ణమూర్తి ఐపీఎస్ నేతృత్వంలో నగర పోలీసులు ఈ కేసుపై ప్రత్యేక దృష్టి సారించారు. చిలకలగూడ డివిజన్ ఇన్‌చార్జ్ ఏసీపీ శ్రీ ఎ. యాదగిరి పర్యవేక్షణలో దర్యాప్తు వేగవంతం చేశారు.
ఈ క్రమంలో చిలకలగూడ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ), ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ వి. రామకృష్ణతో పాటు డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ ఎల్. మధుబాబు తమ సిబ్బందితో కలిసి రంగంలోకి దిగారు. సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలను విశ్లేషించి నిందితులను పట్టుకోవడంలో ఈ పోలీస్ బృందం కీలక పాత్ర పోషించింది. పక్కా ప్రణాళికతో కేసును ఛేదించిన ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ మధుబాబు మరియు చిలకలగూడ పోలీస్ సిబ్బందిని డీసీపీ రక్షితా కృష్ణమూర్తి ప్రత్యేకంగా అభినందించారు.
చిలకలగూడ సాయుధ దోపిడీ కేసును ఛేదించిన పోలీస్ అధికారులు
02
Jul