శ్రీ ఉజ్జయిని మహాకాళి ఆలయంలో రుద్రహోమం.

సికింద్రాబాద్ జులై 14,(జే ఎస్ డి ఎం న్యూస్) :
అమావాస్య సందర్భంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి దేవాలయంలో రుద్రహోమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా హోమ క్రతువును జరిపించారు. ఈ విశేష పూజా కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి జి మనోహర్ రెడ్డి తో పాటు ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు కామేశ్వర్, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు. అమావాస్య కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు. సుమారు వంద మందికి పైగా భక్తులు ఈ హోమ క్రతువులో పాల్గొని, స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *