సుదీర్ఘకాలం పాటు విశిష్ట సేవలందించి ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ డీపీఓ AO మరియు పోలీసు సిబ్బందిలను సన్మానించి ఆత్మీయంగా వీడ్కోలు పలికిన ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు – ఉద్యోగ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ఆనందంగా, ఆరోగ్యంగా గడపాలని ఆకాంక్షించిన జిల్లా ఎస్పీ

పోలీసు శాఖలో సుదీర్ఘకాలం పాటు విశిష్ట సేవలందించి ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ (DPO) లోని అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ (AO) వి.వెంకట రామమోహన్(42 సర్వీస్), వై.పాలెం పియస్ లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ SK.ఖాసీం వలి ,జిల్లా ఎఆర్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న E.నారాయణ రెడ్డి 35సం’5 నెలలు లను శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలతో సత్కరించి, వెండి జ్ఞాపికలను అందజేసి ఘనంగా సన్మానించి ఆత్మీయ వీడ్కోలు పలికారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AO) పోస్టు జిల్లా పోలీసు పరిపాలనలో అత్యంత కీలకమైనదని, జిల్లా పోలీసు కార్యాలయంలో రోజువారీ పరిపాలనా వ్యవహారాలు, వివిధ సెక్షన్ల పనితీరు, ఫైళ్ల నిర్వహణ, పరిపాలనా సమన్వయం వారి పర్యవేక్షణలోనే కొనసాగుతాయన్నారు.పోలీసు సిబ్బంది సర్వీస్ రికార్డులు, జీతభత్యాలు, బదిలీలు, సెలవులు, పదోన్నతులు, ఉద్యోగ విరమణకు సంబంధించిన అన్ని అంశాలను అత్యంత బాధ్యతాయుతంగా నిర్వహించారన్నారు.

పోలీసు శాఖలో చేరిన నాటి నుంచి ప్రజలకు సేవ చేస్తూ గౌరవప్రదంగా ఉద్యోగ విరమణ పొందడం గొప్ప అదృష్టమన్నారు. పోలీసు విధుల నిర్వహణలో కుటుంబానికి దూరంగా ఉండి జిల్లా పోలీసు శాఖకు అందించిన సేవలను ఎప్పటికీ గుర్తుంచుకుంటామని తెలిపారు. సకాలంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందేలా చర్యలు తీసుకుంటామని, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ మిగిలిన జీవితాన్ని కుటుంబ సభ్యులతో ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో గడపాలని ఆకాంక్షించారు.

ఉద్యోగ విరమణ అనంతరం కూడా మీరు పోలీసు కుటుంబంలో సభ్యులేనని, భవిష్యత్తులో వారికి ఏ సహాయం కావాలన్నా పోలీస్ శాఖ ఎల్లవేళలా వారికి తోడుగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పోలీసు విధుల నిర్వహణలో నిరంతరం అండగా నిలిచిన కుటుంబ సభ్యులకు జిల్లా పోలీసు శాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఉద్యోగ విరమణ పొందిన సిబ్బంది కుటుంబ సభ్యుల యోగక్షేమాలు, పిల్లల విద్య, ఉద్యోగ వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, డిసిఆర్బీ ఇన్స్పెక్టర్ దేవప్రభాకర్, ఆర్ఐ సీతారామి రెడ్డి, ఆర్ఎస్సై తిరుపతి స్వామి, డిపిఓ సిబ్బంది, పోలీస్ సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *