శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న తలసాని కుటుంబ సభ్యులు.

సికింద్రాబాద్ జులై 31(జే ఎస్ డి ఎం న్యూస్)
సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులు శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు సంప్రదాయాల ప్రకారం వారితో పూజలు నిర్వహింప చేశారు తీర్థప్రసాదాలను అందించారు. శాలువాలతో పూలదండలతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా తలసాని సతీమణి స్వర్ణ మాట్లాడుతూ శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారిఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకునామన్నారు.
బోనాల పండుగ ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలన్నారు.స్వర్ణ తో పాటు అమ్మవారిని దర్శించుకున్న వారిలో తలసాని సాయికిరణ్ యాదవ్ సతీమణి మహిత , రాంగోపాల్ పేట్ మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ శ్రీనివాస్ గౌడ్ తదితరులు ఉన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *