హైదరాబాద్లోని గచ్చిబౌలి జీఎంసీ బయో ఇండోర్ స్టేడియంలో జూలై 23 నుంచి 30 వరకు నిర్వహించిన 11వ ఆల్ ఇండియా పోలీస్ జూడో క్లస్టర్–2026 పోటీల్లో భాగంగా జరిగిన పెన్కక్ సిలట్ (Pencak Silat) 80-85 కేజీల విభాగంలో గోల్డ్ పతకం (ప్రధమ స్థానం) సాధించిన డి.ఎన్.బి రత్నబాబు@ గోపి (PC- 2609, పుల్లల చెరువు పి.యస్ మార్కాపురం జిల్లా) ను జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, ఒకవైపు పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తూనే, మరోవైపు క్రీడల పట్ల ఉన్న ఆసక్తితో నిరంతరం సాధన చేస్తూ జాతీయ స్థాయిలో పతాకం సాధించడం అభినందనీయమని ప్రశంసించారు. ప్రకాశం జిల్లా పోలీస్ శాఖకు చెందిన సిబ్బంది జాతీయ స్థాయిలో గోల్డ్ పతాకం సాధించడం జిల్లా పోలీస్ శాఖకు గర్వకారణమన్నారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో జరిగే పోటీల్లోనూ ప్రతిభ కనబరిచి, రాష్ట్ర పోలీస్ శాఖకు కీర్తి ప్రతిష్ఠలు తీసుకురావాలని ఆకాంక్షించారు. డిసెంబర్ నెలలో ఆస్ట్రేలియాలో జరగనున్న ప్రపంచ పోలీస్ క్రీడా పోటీలకు ఎంపిక కావడం అభినందనీయమన్నారు.
