న్యూఢిల్లీ, ఆగస్టు 23 : న్యూఢిల్లీలో కాన్స్టిట్యూషన్ క్లబ్ లో ఆదివారం జాతీయ సఫాయి కరం చారి కమిషన్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో ఆంధ్రప్రదేశ్ అఖిల భారత సఫాయి మజ్దూర్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు భూపతి అప్పారావు, వైస్ ప్రెసిడెంట్ గద్దె త్యాగరాజు, మామిడి అర్జున్ రావులు ఆంధ్రప్రదేశ్ నుండి హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం 1993 చట్టం ప్రకారం పారిశుద్ధ్య కార్మికులకు విముక్తి పునరావాస పథకం. కల్పించాలని కోరుతూ పార్లమెంట్ లో బిల్లు ఆమోదించి 1994 ఆగస్టు 23న చట్టంగా రూపొందించబడింది. దీని అమలు కొరకు జాతీయ సఫాయికరంచారి కమిషన్ ఏర్పాటు చేశారు ఈ కమిషన్ లో ఒక చైర్మన్, ఒక వైస్ చైర్మన్, ఐదుగురు సభ్యులు (అందులో ఒక మహిళా సభ్యురాలును నియమించారు ఆనాటి నుండి పారిశుధ్య కార్మికుల పరిరక్షణ కోసం జాతీయ కమిషన్ పనిచేస్తుంది.ఆగస్టు 23 తో 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు న్యూఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ లో జాతీయ కమిషన్ వైస్ చైర్మన్ హర్ దీప్ సింగ్ గిల్ మరియు కమిషన్ సభ్యులు కరమ్ సింగ్ కర్మల ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మాట్లాడుతూ పారిశుధ్య కార్మికుల గౌరవప్రదమైన జీవనం, వారి సంక్షేమం కొరకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం చేశారు. కేంద్ర సామాజిక న్యాయం సాధికారత సహాయ మంత్రి రాందాస్ అధవాలే మాట్లాడుతూ ప్రమాదకర మాన్యువల్ స్కావెంజింగ్ నిర్మూలన, యాంత్రీకరణను ప్రోత్సహించడం,పునరావాసం, సామాజిక భద్రతా పథకాల అమలుకు పాటుపడుతున్నామన్నారు ఔట్ సోర్సింగ్ ,కాంట్రాక్ట్ విధానంలో ఉన్న పారిశుధ్య కార్మికులను పర్మినెంట్ చేసే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోందనిరాందాస్ అదవాలే ఒక విధాన ప్రకటన చేశారు. ఇది దేశవ్యాప్తంగా ఉన్న పారిశుధ్య కార్మికులకు శుభవార్తగా భావించారు.ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల నుండి హాజరయ్యి దక్షిణ భారతదేశంలో పారిశుధ్య కార్మికులు ఎదుర్కొంటున్న ప్రత్యేక సమస్యలను సఫాయి మజ్దూర్ ట్రేడ్ యూనియన్ నాయకులు కేంద్ర మంత్రులు దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో దక్షిణ భారత దేశంతో పాటుఉత్తర భారతదేశం లోనినాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


