హైదరాబాద్ 13 ,(జే ఎస్ డి ఎం న్యూస్) :
వినాయక చవితి పర్వదినాన్నిపురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్పర్సన్, సీఎం ప్రజావాణి స్టేట్ ఇంచార్జ్ గద్వాల్ విజయలక్ష్మిహృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
విఘ్నాలను తొలగించి, ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యం,ఆయురారోగ్యాలను ప్రసాదించే విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ప్రతి కుటుంబంపై ఉండాలని ఆమె
ఆకాంక్షించారు.వినాయక చవితిని ప్రజలంతా భక్తిశ్రద్ధలతో,ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆమె కోరారు. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి, పండుగనుపర్యావరణహితంగా నిర్వహించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గణేష్ మండపాల వద్ద భక్తులు జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించారు.
గణనాథుని ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించాలని, ప్రజలందరూసుఖసంతోషాలతో, ఐకమత్యంతో
జీవించాలని గద్వాల్ విజయలక్ష్మి ఆకాంక్షించారు.
