రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ జిల్లా కలెక్టర్లతో వీక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సదరు వీక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పి రాజబాబు కలెక్టర్ కార్యాలయంలోని మినీ సమావేశ మందిరం నుండి పాల్గొన్నారు. ఇందులో భాగంగా సి ఎస్ సాయి ప్రసాద్ గారు మాట్లాడుతూ జిల్లా స్థాయి అధికారులు, శాసన సభ్యులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆదేశించిన పలు పనులకు సంబంధించి విపులంగా సమీక్షించారు. అనంతరం జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో మాట్లాడుతూ ప్రముఖంగా డైరీ యూనిట్, రోడ్లు భవనాల శాఖ తరపున నిర్వహించవలసిన రోడ్లు, గ్రామీణ నీటి సరఫరా, అద్దంకి బస్టాండ్, ఆంధ్ర కేసరి యూనివర్సిటీ, హార్టికల్చర్ ,, ఇరిగేషన్ తదితర శాఖలకు సంబంధించిన పనులకు ప్రభుత్వానికి వెంటనే ప్రతిపాదనలను సంబంధిత శాఖల హెచ్ ఓ డిల ద్వారా అందజేయవలసిందిగా అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకటరమణ, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణాధికారి చిరంజీవి, డిటిసి సుశీల, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

