సమాజం లో స్థిరపడినవారు పేదలకు తమ వంతు సహాయ సహకారాలు అందించాలి – పి రాజబాబు

సమాజంలో అసమానతలు తొలగించే విధంగా అన్ని రకాలుగా స్థిరపడినవారు పేదలకు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని పి రాజబాబు పేర్కొన్నారు. గురువారం చాకలి పాలెం, మద్దిపాడు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను స్థానిక శాసన సభ్యులు విజయ కుమార్ తో కలిసి కలెక్టర్ పి.రాజాబాబు ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

అనంతరం ఏర్పాటు చేసిన పేదల సేవలో -2.o కార్యక్రమంలో పాల్గొన్నారు. అర్జీ దారుల నుండి సుమారు 82 అర్జీలను స్వీకరించిన అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ గ్రామస్థాయిలో ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల యొక్క అవసరాలు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించడమే ముఖ్య ఉద్దేశం అన్నారు. ప్రతినెలా మొదటి తారీకు లేదా మొదటి తారీకు ప్రభుత్వ సెలవు దినం అయితే ముందు రోజు గానే పింఛన్లు పంపిణీ తో పాటు ప్రజా సేవలో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నదని తెలిపారు. ప్రజా సేవలో కార్యక్రమం ఇక్కడి నుంచే మొదలుపెట్టడం జరిగింది అన్నారు. ఇందులో భాగంగా సంక్షేమ శాఖల అధికారులు ఆయా శాఖల అభివృద్ధి పథకాలను పరిశీలించడం జరుగుతుందన్నారు. గ్రామం తద్వారా మండలం రాష్ట్ర అభివృద్ధి జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. జిల్లా మొత్తం మీద సుమారు రెండు లక్షల పదహారు వేల మందికి 94 కోట్ల మేర పింఛన్లు అందజేయడం జరుగుతుందన్నారు. వి బి జి రాంజీ కార్యక్రమం కింద 100 కోట్ల నిధులు నుండి 140 కోట్ల వరకు అనుమతులు మంజూరు చేయడం జరిగిందన్నారు. గ్రామాలకు లింకు రోడ్లు ఏర్పాటు చేయడం ద్వారా భూముల విలువలు పెరగడంతోపాటు అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ఈ నియోజకవర్గంలో మూడు ప్రజా సమస్యల పరిష్కార వేదికల కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. సమాజంలో బాగా పలు రకాలుగా ఎదిగిన వారు నేను కూడా సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలనే దృక్పథంతో ముందుకు వెళ్లాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు అని ఆయన ఈ సందర్భంగా తెలియజేస్తూ పేదల కు తమ వంతు సహాయ సహకారాలు అందజేయాలని ఆయన కోరారు. పేదలకు చేసే సహాయం ఏదైనాను విద్య ,ఆర్థిక ఇతరములు సంబంధించి ఉంటాయని ఆయన పేర్కొన్నారు.

స్థానిక శాసనసభ్యులు బి. ఎన్. విజయ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అభివృద్ధి సంక్షేమమని దాని ఫలితాలు ప్రతి పేదవానికి అందాలని ఆయన అన్నారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు రహదారులు విస్తరణకై 20 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. నియోజకవర్గ మొత్తం మీద 110 కోట్ల మేర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. సర్వీస్ రోడ్లు తారు రోడ్లు రోడ్లు ఏర్పాటు చేయుట ద్వారా రైతులకు ఆర్థికంగా ఎంతో మేలు జరిగిందని భూముల విలువలు పెరిగాయని ఆయన అన్నారు. తల్లికి వందనం కార్యక్రమం ద్వారా 40 కోట్ల మేర సంవత్సరానికి నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ ద్వారా చాలామంది పేదలకు వేదిక వచ్చిన నిమిత్తం నిధులు అందించడం జరిగిందన్నారు. ఆర్థికంగా ఎదిగిన వారు సమ సమాజ స్థాపన కోసం పేదలకు వితౌదికంగా తమ వంతు సహాయ సహకారాలు అందించినప్పుడు మనస్శాంతిగా ఉంటుందని ఆయన అన్నారు. తనవంతుగా స్మశాన వాటిక మరియు పేదల ఇంటి వసతి కోసం మూడు ఎకరాల స్థలాన్ని ఇవ్వడం జరుగుతున్నదని, అదేవిధంగా స్మశాన వాటిక ఏర్పాటు జరుగుతుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి మండల ప్రత్యేక అధికారి మాధురి, ఈడీ బీసీ కార్పొరేషన్ వెంకటేశ్వరరావు, డిపిఓ అనుపమ, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ నారాయణ, వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటేశ్వరరావు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Back to list

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *