రోడ్లు, ఫుట్ పాత్ లు ఆక్రమించి ట్రాఫిక్ కు ఇబ్బందులు సృష్టిస్తే కఠిన చర్యలు….బేగంపేట ఎస్ బి ఐ లైన్,షాపర్స్ స్టాప్ గల్లీలలో రోడ్డు ఆక్రమణలు తొలగించిన ట్రాఫిక్ పోలీసులు…

బేగంపేట అక్టోబర్ 8 (జే ఎస్ డి ఎమ్ న్యూస్ ) :
రోడ్లు, ఫుట్ పాత్ లు ఆక్రమించి ట్రాఫిక్ కు ఇబ్బందులు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని తిరుమలగిరి ట్రాఫిక్ ఏసిపి జి శంకర్రాజు హెచ్చరించారు. గురువారం
బేగంపేట ఎస్ బి ఐ లైన్,షాపర్స్ స్టాప్ గల్లీలలో ఉన్న రోడ్డు, ఫుట్ పాత్ ఆక్రమణలను ట్రాఫిక్ పోలీసులతో కలసి జిహెచ్ఎంసి అధికారులు తొలగించారు.
మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి, ఆదేశాల మేరకు, ట్రాఫిక్-I డీసీపీ కె. రాహుల్ రెడ్డి, పర్యవేక్షణలో,గురువారం బేగంపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షాపర్స్ స్టాప్ పరిసర ప్రాంతాల్లో రోడ్డు ఆక్రమణల తొలగింపు కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసిపి శంకర్రాజు మాట్లాడుతూ బేగంపేట ప్రధాన రోడ్డు తో పాటు ఇతర ప్రాంతాలలో ఫుట్పాతులు రోడ్లు ఆక్రమించి వ్యాపారాలు నిర్వహించే వారిని గుర్తించి వాటిని తొలగిస్తామని హెచ్చరించారు. ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తే కఠిన చర్యలు చేపడతామని అన్నారు ప్రధాన రోడ్లపై ఉన్న వాణిజ్య సముదాయాలు, హోటళ్లు తమ వద్దకు వచ్చే కస్టమర్లకు పార్కింగ్ సౌకర్యం కల్పించాలని రోడ్లపైన పార్కింగ్ చేస్తే కేసులు నమోదు చేస్తామని ఏసిపి హెచ్చరించారు. నిరంతరం పర్యవేక్షిస్తూ డ్రైవ్ ను కొనసాగిస్తామని ఆయన తెలియజేశారు. ఈ ప్రత్యేక డ్రైవ్‌లో ట్రాఫిక్ రాకపోకలకు ఆటంకం కలిగిస్తున్న అక్రమ రోడ్డు ఆక్రమణలను గుర్తించి, సంబంధిత శాఖలసమన్వయంతో తొలగించారు.
అక్రమ ఆక్రమణలను తొలగించడం ద్వారా రహదారిపై అందుబాటులో ఉన్న స్థలం ఖాళీ చేయబడటంతో పాటు, వాహనాల రాకపోకలకు మరింత సౌకర్యం కలిగింది. గతంలో ఆక్రమణల కారణంగా ఈ ప్రాంతంలో ట్రాఫిక్ రాకపోకలు నెమ్మదిగా సాగుతూ, రద్దీ ఏర్పడేది. ఆక్రమణలను తొలగించిన అనంతరం ట్రాఫిక్ ప్రవాహం గణనీయంగా మెరుగుపడి, వాహనాల రాకపోకలు సాఫీగా సాగుతున్నాయి.
ఈ ప్రత్యేక డ్రైవ్‌లో తిరుమలగిరి ట్రాఫిక్ ఏసిపి జి. శంకర్ రాజు, బేగంపేట ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కావేటి శ్రీనివాస్, ప్రమోద్, ఆర్ ఎస్ ఐ అశోక్ రెడ్డి, ఎస్ఐ శివరాజ్ ట్రాఫిక్ సిబ్బంది, జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ ఏసీపీ కురుమయ్య ట్రాఫిక్, జిహెచ్ఎంసి సిబ్బంది పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *