తెలుగు రాష్ట్రాల్లో అన్ని స్కూళ్లకు ఎల్లుండి నుంచే దసరా సెలవులు
తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలలకు దసరా సెలవుల షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణలో అక్టోబర్ 10 నుండి 22 వరకు (13 రోజులు) పాఠశాలలకు సెలవులు ప్రకటించగా, అక్టోబర్ 23న పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి. జూనియర్ కళాశాలలకు అక్టోబర్ 10 నుండి 21 వరకు సెలవులు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో, వారాంతపు సెలవులతో కలిపి అక్టోబర్ 10 నుండి 21 వరకు పాఠశాలలకు సెలవులు వర్తిస్తాయి, అక్టోబర్ 22న పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి. సెలవుల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించరాదని విద్యాశాఖ ఆదేశించింది.

Save or share this story as a newspaper-style Epaper Clip: