నల్సార్ జంక్షన్‌లో అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత పై అవగాహన కార్యక్రమం.

బేగంపేట అక్టోబర్ 10,(జే ఎస్ డి ఎమ్ న్యూస్ )
నల్సార్ జంక్షన్‌లో అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, ప్రమాదాలకు ఆస్కారం ఉన్న బ్లాక్ స్పాట్‌గా గుర్తించబడిన నల్సార్ జంక్షన్‌లో శనివారం రోడ్డు భద్రత పై అవగాహన కార్యక్రమం
నిర్వ హించారు. రహదారివినియోగదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించడం, ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టడం, సురక్షిత ప్రయాణాన్ని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం.ఈ సందర్భంగా వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించడం, లేన్ క్రమశిక్షణను అనుసరించడం, ద్విచక్రవాహనదారులు హెల్మెట్
ధరించడం, కార్లలో ప్రయాణించేవారు సీట్ బెల్ట్ ధరించడం, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగించకపోవడం, నిర్ణీత వేగ పరిమితులను పాటించడం, పాదచారుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.అలాగే, ట్రాఫిక్ సిగ్నళ్లను పాటించడం, మద్యం సేవించి వాహనాలు నడపకపోవడం, అత్యవసర సేవల వాహనాలకు దారి ఇవ్వడం, జంక్షన్లు మరియు పాదచారుల క్రాసింగ్‌ల వద్ద అప్రమత్తంగా ఉండడం, వాహనాలను నిర్లక్ష్యంగా నడపకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించడం వంటి అంశాలను వివరించారు.
మీ భద్రత మీ చేతుల్లోనే ఉంది. సురక్షితంగా ప్రయాణించండి, క్షేమంగా గమ్యస్థానానికి చేరుకోండి. అనే సందేశంతో రహదారి భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించడంతో పాటు అమూల్యమైన ప్రాణాలను కాపాడవచ్చని సూచించారు.
ఈ కార్యక్రమంలో తిరుమలగిరి ట్రాఫిక్ ఏసిపి జి శంకర్ రాజు ,అల్వాల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ జి. పవన్ కుమార్ రెడ్డి, అదనపు ఇన్‌స్పెక్టర్ జి. జనకీరాములు, ఎస్‌ఐ ఎ. నవీన్ రెడ్డి, ఎస్‌ఐ ఎం. కిషోర్, హెచ్ కె ఆర్ రోడ్ వేస్ ప్రతినిధి బాలరాజు, రోడ్ సేఫ్టీ ఎస్‌ఐ జోజి మరియు వారి బృందం పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *