తాళ్లూరు: తాళ్లూరు, కుంకుపాడు రోడ్డు ఎంతో ప్రాముఖ్యత కలిది. ఈ రోడ్డు మార్గంలో అద్దంకి కేవలం 15 కి.మీలు కావటంతో ఉద్యోగులు, వివిధ పనులపై అద్దంకి వెళ్తే ప్రజలు నిత్యం ఈ రోడ్డును ఉపయోగిస్తుంటారు. ఈ రోడ్డు మార్గంలో చిలకలేరు ఉండటంతో ఎక్కవగా ఇసుక ట్రాక్టర్లు, టిప్పర్లు తిరిగి మోకాలు లోతు గుంతలు సైతం ఏర్పడ్డాయి. అయితే నిత్యం ప్రజలు ఇబ్బందులను గుర్తించిన దర్శి టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఈ రోడ్డు పునర్మిణానికి పూనుకున్నది. అదే తడువుగా మాజీ జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి జనసేన పార్టీలో చేరటం, ఆయన బాలినేని శ్రీనివాస రెడ్డి ముఖ్య అనుచరుడుగా కావటంతో ఈ రోడ్డు విషయమై టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత్ సాగర్ దృష్టికి తీసుకువెళ్లటంతో వారు సానుకూలంగా స్పందించి మంజూరు సహకరించారు. దీంతో డిప్యూటీ డీసీఎం పవన్ కళ్యాణ్ పీవీబీజీ రామ్జీ 3.0లో రూ.2.45 లక్షల నిధులు మంజూరు అయ్యారు. దీంతో నిత్యం ఈ రోడ్డుపై ప్రయాణిస్తున్న ప్రజలు, ఉద్యోగులు, రైతుల కష్టాలు తీరనున్నాయి. ప్రజలు రోడ్డు కష్టాలను గుర్తించి నిధుల మంజూరుకు సహకరించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు, టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత్ సాగర్లకు, జనసేన నేత, మాజీ జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, మాజీ నర్పంచి పోశం శ్రీకాంత్ రెడ్డిలను ప్రజలు కృతజ్ఞతలు ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నారు.


Save or share this story as a newspaper-style Epaper Clip: