తాళ్లూరు: సమిష్టిగా పనిచేసి స్థానిక ఎన్నికలలో సమర్ధవంతంగా ఎదుర్కోవాలని దర్శి ఎమ్మెల్యే, వైసీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి అన్నారు. తాళ్లూరు పార్టీ కార్యాలయంలో సోమవారం మండలస్థాయి కార్యకర్తల సమావేశంలో స్థానిక ఎన్నికల సమాయత్తం నిర్వహించారు. రాష్ట్ర సీఈసీ మెంబర్ బూచేపల్లి వెంకాయమ్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి కార్యకర్తలకు దిశానిర్ధేశం చేసారు. అందరూ డాక్టర్ బూచేపల్లి ప్రతిష్ట మరింత పెంచటానికి స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాల్సిన ఆవశ్యకతను వక్తలు వివరించారు. మండల పార్టీ అధ్యక్షుడు టీవీ సుబ్బా రెడ్డి, జిల్లా కార్యదర్శి మారం ఇంద్రసేనా రెడ్డి, మాజీ జెడ్పీటీసీ ఎల్ జి వెంకటేశ్వర రెడ్డి, మాజీ జిల్లా కోఆప్షన్ మెంబర్ ఆదాం షరీఫ్ (బుజ్జి), కోట క్రిష్ణా రెడ్డి, కోట మన్నే రెడ్డి, ఉపాధ్యక్షులు పులి ప్రసాద్ రెడ్డి, ఆలోకం హరిబాబు , మాజీ ఎంపీపీ గోళ్లపాటి మోషే, మాజీ ఎంపీటీసీ యామర్తి ప్రభుదాస్, యూత్ అధ్యక్షుడు విష్ణు, నాగార్జున రెడ్డి, మాజీ సొసైటీ డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి, చిట్టెయ్య సోము అనిల్ కుమార్ రెడ్డి, మాజీ సర్పంచిలు మేకల చార్లేస్ సర్జన్, పులి క్రిష్ణా రెడ్డి, హనుమంత రావు, వలి, సుబ్బా రావు, వలసా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






Save or share this story as a newspaper-style Epaper Clip: