ఎల్ నినోకుపరిష్కారం చతుర్విధ జల ప్రక్రియ మాత్రమే -బీ జే పీ జాతీయ కౌన్సిల్ సభ్యులు మర్రి శశిధర్ రెడ్డి.

హైదరాబాద్ అక్టోబర్ 12,(జే ఎస్ డి ఎం న్యూస్ ) :
ఎల్ నినోకు పరిష్కారం చతుర్విధ జల ప్రక్రియ మాత్రమే నని మాజీ ఎన్ డి ఎం ఏ వైస్ చైర్మన్, బీ జే పీ జాతీయ కౌన్సిల్ సభ్యులు మర్రి శశిధర్ రెడ్డి అన్నారు .తరచూ సంభవిస్తున్న ఎల్ నినో వల్ల ప్రతి 2 నుండి 7 సంవత్సరాలకు ఒకసారి భారతదేశంలో కరువు వస్తుందని,
ఈ అంశంపై సోమవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో మర్రి తన అభిప్రాయాన్ని వెల్లడించారు.ఈ సంవత్సరం ‘సూపర్ ఎల్ నినో’ వల్ల మహారాష్ట్రలో 83 శాతం ప్రాంతం, కర్ణాటకలో 90 శాతం పంటలు, ఆంధ్రప్రదేశ్ లో 388 మండలాలు, తెలంగాణలో 50 శాతం మండలాలు తీవ్ర కరువు బారిన పడ్డాయని ఆయన ఆవేదన వ్యక్తం
చేశారు.గత 50 ఏళ్లుగా అమలు చేస్తున్న తాత్కాలిక కరువు నివారణ కార్యక్రమాల వల్ల ప్రయోజనం లేదని, 1990లో దివంగత ఇంజనీర్ *టి. హనుమంతరావు రూపొందించిననాలుగు నీటి భావన (Four Waters Concept) మాత్రమే శాశ్వత పరిష్కారమని అన్నారు.ఈ విధానాన్ని అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు Water Conservation Mission గా ప్రారంభించారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.ఈ చతుర్విధ జల ప్రక్రియ అమలు ద్వారా రైతులకు సంవత్సరానికి 3 పంటలకు నీరు అందించవచ్చని, భూగర్భ జలాలు గణనీయంగా పెరుగుతాయని తెలిపారు. దీనివల్ల ప్రభుత్వాలపై కరువు సాయం భారం తగ్గుతుందని, ప్రజల వలసలు ఆగుతాయని, రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదాలు కూడా తగ్గుతాయని అన్నారు.ఇప్పటి సంగారెడ్డి జిల్లాలోని రెడ్డిగూడెం (గొట్టిగారి) గ్రామంలో 2001లో ఈ విధానాన్ని అమలు చేశారని, దానివల్ల 2014, 2015లో వచ్చిన వరుస కరువులను కూడా ఆ గ్రామం తట్టుకుని నిలబడిందని తెలిపారు. అదేవిధంగా రాజస్థాన్ లో 2014-2018 మధ్య అప్పటి ముఖ్యమంత్రి వసుంధర రాజే సింధియా హయాంలో
ఈ విధానం విజయవంతంగా అమలైందని చెప్పారు.ఈ విధానాన్ని ఎకరాకు కేవలం రూ. 15,000 వ్యయంతో అమలు చేయవచ్చని , అదే దేశం మొత్తానికి రూ. 5.5 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని ఇది నదులఅనుసంధానం కంటే చాలా తక్కువ అని శశిధర్ రెడ్డి అన్నారు. దీనితో దేశం మొత్తాన్ని కరువు రహితంగా చేయడానికి దీనిని జాతీయ విధానంగా ప్రకటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని మర్రి శశిధర్ రెడ్డి కోరారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *