చీమకుర్తి: ప్రముఖ పారిశ్రామిక యొక్క మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు కుమారుడు శిద్ధా సుధీర్ కుమార్ పుట్టినరోజు వేడుకలు హరిహర క్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శిద్ధా రాఘవరావు,లక్ష్మీ పద్మావతి పాల్గొని సుధీర్ కి ఆశీర్వచనాలు తెలిపారు. చీమకుర్తి ప్రముఖులు మరియు వ్యాపారవేత్తలు వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు శిద్ధ సుధీర్ కుమార్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం శ్రీ హరి హర క్షేత్రంలోని అన్ని గుళ్ళలో పూజా కార్యక్రమాలు ముగించుకుని కేక్ కట్ చేశారు. అనంతరం దృష్టిలో పనిచేస్తున్న వర్కర్స్ కు టీ షర్ట్లు అందజేశారు. అనంతరం వచ్చిన అందరికీ కూడా భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గోల్డెన్ గ్రానైట్ మేనేజర్ గిరిబాబు, బొమ్మిశెట్టి కిరణ్,బొమ్మశెట్టి మధు, నూకల సుబ్రమణ్యం, గ్రంధి శ్రీహరి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కాట్రగడ్డ రమణయ్య, మనం ప్రసాదు, రావిపాటి రాంబాబు, అవనిగడ్డ శేషయ్య, వైసీపీ సీనియర్ నాయకులు గోగినేని వెంకటేశ్వర్లు, ఆముదాల పల్లి రామబ్రహ్మం, పాలడుగు సుబ్బారావు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు తదితరులు పాల్గొన్నారు.




Save or share this story as a newspaper-style Epaper Clip: