కౌంటింగ్ సిబ్బంది జాగరుకుతతో ఓట్లు లెక్కింపుని చేయాలని….. జిల్లా కలెక్టర్ పి రాజబాబు-ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరిగేటప్పుడు 100% కౌంటింగ్ పైన దృష్టి కేంద్రీకరించాలి…. జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు- పోలింగ్ ప్రక్రియలో సిబ్బంది సమగ్రంగా నిర్వహించడం జరిగిందని అదే స్ఫూర్తితో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా కూడా పూర్తి చేయాలని సూచన..

జిల్లా కలెక్టర్ పి రాజబాబు సోమవారం స్థానిక రైస్ కాలేజీలో మంగళ వారం నిర్వహించనున్న ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన సిబ్బందితో మాట్లాడుతూ పిఓలకు, ఏపీవోలకు పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వడం జరిగిందని ఆయన.
అన్నారు. అంతేకాకుండా బ్యాలెట్ పేపర్లను ఎలా మడచాలో కూడా ప్రత్యక్షంగా తెలియజేయడం జరిగింది అన్నారు. పోలింగ్ ప్రక్రియ కన్నా కౌంటింగ్ ప్రక్రియ చాలా ముఖ్యమైనదని ఆయన ఈ సందర్భంగా సూచించారు. కౌంటింగ్ ప్రక్రియ ద్వారా అభ్యర్థుల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని ఆయన తెలిపారు. పోలింగ్ కేంద్రంలో టేబుల్స్ మధ్య గ్యాప్ ఎలా ఉండాలి ఒక టేబుల్ కి ఎంత మంది కూర్చుంటున్నారు అనేది విషయాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి బ్యాలెట్ బాక్స్ ఎలా ఓపెన్ చేసేది కూడా పరిశీలించారు. ఏజెంట్ గ్యాలరీ నుంచి ఓట్ల లెక్కింపు కనబడే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని సమస్యలు ఏమైనా ఉంటే సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. టేబుల్ వద్ద సిబ్బంది అనవసరమైన చర్చలు జరుపకూడదని కౌంటింగ్ పైనే దృష్టి కేంద్రీకృతం చేయాలన్నారు. బాక్సులను ఓపెన్ చేసేటప్పుడు జాగరుకుత వహించాలన్నారు. ఈ సందర్భంగా ఓట్ల లెక్కింపు సిబ్బంది కి పలు సూచనలు సలహాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట అధికారి వెంకటేశ్వరరావు, రామచంద్ర రావు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *