తాళ్లూరు: ఫెర్టిలైజర్స్ ఫ్రేమ్ వర్క్ యాప్‌పై అవగాహన కలిగి ఉండాలని మండల వ్యవసాయాధికారి ప్రసాద రావు కోరారు. తూర్పుగంగవరంలో బుధవారం రైతు సేవా కేంద్రాలు, ఫెర్టిలైజర్స్ దుకాణాలు, సొసైటీ,గ్రోమోర్ కేంద్రాల యజమానులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రైతులకు సంబంధించిన వివరాలు అన్ని యాప్‌లో నమోదు అయి ఉంటాయని, రైతులు యాప్ ద్వారా అవసరమైన మేర స్టాక్‌ను బుక్ చేసుకోవాలని చెప్పారు. పారదర్శకతకు యాప్ ఎంతో ఉపయోగపడుతుందని, ప్రతి రైతు ఉ పయోగించేలా తగిన అవగాహన కల్పించాలని కోరారు.

Save or share this story as a newspaper-style Epaper Clip: