బకాయి వేతనాలు చెల్లించాలని పారిశుధ్య కార్మికుల నిరసన

పారిశుధ్య కార్మికులకు 10 నెలల వేతన బకాయిలు చెల్లించేవరకూ పోరాటం తప్పదని సిఐటియు దర్శి నియోజకవర్గ కార్యదర్శి తాండవ రంగారావు తెలిపారు. ఎంపిడిఒ కార్యాలయం వద్ద ఇస్మాయిల్ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రంగారావు మాట్లాడుతూ 2022 అక్టోబరు నుంచి 2023జులై వరకూ కార్మికులకు జీతాలు పెడింగ్లో ఉన్నట్లు తెలిపారు. అనంతరం ఈఒఆర్డి శోభన్ బాబుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు దానయ్య, గంగయ్య, చలమయ్య, తిరుపతమ్మ, బాలగురవయ్య, కోటయ్య, ఏసు, నాంచారయ్య, రూతమ్మ, లక్ష్మీదేవి, సంపూర్ణ, శ్రీను, ఇస్సాక్ పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *