దర్శి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ షకీలా అమీన్ బాషా, గ్రీనరీ అండ్ బ్యూటీఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజిరెడ్డిలు ప్రకాశంపంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్రానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. వైఎస్ఆర్సిపి నాయకులు పుట్టరవి, గంజి వెంకటేశ్వరరెడ్డి, మురళీ, ఖాళీం, యర్రయ్య తదితరులు పాల్గొన్నారు.
