సన్న, చిన్న కారు రైతులు నవధాన్యాలను సాగు చేయటం వల్ల లాభదాయకంగా వుంటుందని జిల్లా పధక యాజమాన్య విభాగం ప్రాజెక్టు మేనేజర్ బి. సుభాషిణి తెలిపారు. తూర్పు గంగవరం రైతుభరోసా కేంద్రంలో సన్న, చిన్నకారు రైతులకు పంటల సాగుపై జరుగుతున్న శిక్షణ కార్యక్రమాన్ని సందర్శించి మాట్లాడారు. విషపూరిత, రసాయన, పురుగు మందులు లేకుండా పంటలను సాగు చేయాలన్నారు. ప్రకృతి వ్యవసాయం సాగు చేయటం వల్ల ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను ఇచ్చే దిగుబడులు వస్తాయన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ఉద్యమంలా ముందుకుతీసుక వెళ్లేందుకు సన్న, చిన్న కారు రైతులు సన్నదం కావాలన్నారు. నవధాన్యాల సాగు, కషాయాల తయారీ,జీవామృతాలతయారీ, సీడ్బాల్ రూపంలో విత్తనాలు వెదజల్లడం, పంటమిగుళ్లతో 3 అంగులాల మందము ఆచ్చాదన చేసి భూమి కప్పి ఉంచటం వంటి పంట సాగు చేపట్టే విధానాలను వివరించారు. మండల వ్యవసాయాధికారి బి.ప్రసాదావు మాట్లాడుతూ.. ముఖకార్తెలో మొక్కజొన్న సస్యరక్షణ, కొర్రలో జీవామృతాలు వేసి అంతర కృషి చేయాలని, ఆముదాల్లో సస్య రక్షణ, దాసరి పురుగుల నివారణకు తీసు కోవాల్సిన చర్యల గురించి వివరించా
రు.రైతులు ఏర్పాటు చేసిన అజుల్లా ఫిట్లల క్షేతపరిశీలన చేశారు. ఎస్సీ రైతులకు, మహిళా రైతులకు నవధాన్యకిట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రకృతి ఇంచార్జి పి.నరసింహులు, వై.సీ. హెచ్. రామయ్య, కోఆర్డినేటర్ నవీన్, ఐసీఆర్పీలు నరేష్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.

