పారిశుధ్య కార్మికులకు (క్లాప్ మిత్రులకు) 10 నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడం అన్యాయమని, ప్రభుత్వం జీతాలు ఇచ్చినట్లు ప్రచారం చేయడం దుర్మార్గమని సిఐటియు దర్శి నియోజకవర్గ కార్యదర్శి తాండవ రంగారావు తెలిపారు. పారిశుధ్య కార్మికులకు జీతాలు చెల్లించాలని కోరుతూ తహశీల్దారు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. డిటీ రవిశంకర్ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు దర్శి నియోజకవర్గ కార్యదర్శి రంగరావు మాట్లాడుతూ…. ప్రభుత్వం నెలకు రూ.10వేల వంతున ఇస్తామని జీవో తెచ్చి దానిని అమలు చేయలేదని విమర్శించారు. తొలుత ఎంపిడిఒ కార్యాలయం వద్ద 2వరోజు దీక్ష చేపట్టారు. అనంతరం ఎంపిడిఒ కార్యాలయం వద్ద నుంచి తహశీల్దారు కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఇస్మాయిల్, దానయ్య, గంగయ్య, చలమయ్య, తిరుపతమ్మ, హనోక్, తిరుపతమ్మ, బాలగురవయ్య,
ధర్నా కోటయ్య, ఏసు, నాంచారయ్య, రూతమ్మ, లక్ష్మీదేవి, సిఐటియు నాయకులు ఉప్పు నారాయణ, నాగేశ్వరరావు, డివైఎఫ్ఎస్ఐ కార్యదర్శి కెవి పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.

