ముండ్లమూరు మండలంలోని రమణారెడ్డి పాలెం గ్రామానికి చెందిన వైయస్సార్ సిపి సీనియర్ నాయకులు నూక తోటి నాగాంజనేయులు రత్నకుమారి దంపతుల కుమారుడు ప్రసన్నకుమార్ సుష్మ వివాహ వేడుకకు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులకు అక్షింతలు వేసి ఆశీర్వదించి వివాహ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మండల వైసీపీ కన్వీనర్ సూది దేవర అంజయ్య, మాజీ ఎంపీటీసీ నల్లగట్ల ఈశ్వర చారి, మాజీ సైనికుడు చిరంజీవి, ఆంజనేయ డైరీ ఎండి ఏ నుముల శ్రీనివాసరెడ్డి, మాజీ సర్పంచ్ చింతా శ్రీనివాస్ రెడ్డి, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.





