ప్రతి కూల పరిస్థితులలో సాధారణ దిగుబడి ఇస్తున్న మొక్క జొన్న సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నట్లు వ్యవసాయాధికారి ప్రసాదరావు తెలిపారు. క్షేత్రీయ పర్యటనలో బాగంగా కొర్రపాటి వారి పాలెం, తాళ్లూరులలో పొలాలను ఆయన శుక్రవారం పరిశీలించారు. 90 రోజులలో పంట నిచ్చె స్వల్ప కాలిక రకాలు అందుబాటులో ఉన్నాయని సంకర రకాలు తీపి మొక్కజొన్న, పేలాల మొక్కజొన్న, బేజి కార్న్, పశుగ్రాస మొక్కజొన్నలు సాగు చేయవచ్చని తెలిపారు. బోదే వరుసల మధ్య 60 సెం.మీ, సాళ్లకు మొక్కకు మొక్కకు మధ్య 20 సెం.మీ ఉండేటట్లు విత్తనాన్ని బోదెకు కుడివైపున విత్తినట్లయితే నీటి పారుదల సులభంగా ఉండటమే కాక, ఒక వేళ నీరు ఎక్కువైతే సులభంగా బయటకు వెళ్లటానికి ఇబ్బందులు లేకుండా ఉంటాయని చెప్పారు. విత్తన శుద్ధి తప్పనిసరిగా చెయ్యాలని కోరారు.

