పారిశుధ్య కార్మికులైన క్లాప్ మిత్రులు జిల్లా వ్యాప్తంగా ఆందోళన, పోరాటాలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోక పోవడం అన్యాయం అని , ఈ ప్రభుత్వానికి ప్రజలు ,కార్మికులు తగిన సమయంలో బుద్ది చేబుతారని సిఐటియు దరిశి నియోజకవర్గ కార్యదర్శి తాండవ రంగారావు అన్నారు.
నిర్వధిక ఆందోళన లో భాగంగా ఈరోజు 3వ రోజు ధర్నా శిభిరం నుంచి కార్మికులు , సిఐటియు నాయకులు ప్రదర్శన గా గడియారం స్థంబం వద్దకు చేరుకుని రాస్తారోకో చేసి వాహనాలను నిలుపుదల చేయడం తో ట్రాఫిక్ నిలిచి పోయింది. ఆయన మాటలు కార్మికులు గొత్తెమ్మ కొర్కెలు ఏమి కోరడం లేదని న్యాయమైన డిమాండ్స్ లైన పెండింగ్‌లో ఉన్న 10 నెలల బకాయిలు ఇవ్వాలని , మురికి కూపాలలో పనులు చేస్తున్నందున పనిముట్లు , రక్షణ పరికరాలు ఇవ్వాలని అడుగుతున్న పట్టించుకోక పోతే , కార్మికుల కుటుంబాలు ఎలా జీవిస్తారని ప్రశ్నించారు.. కార్మికులకు ఇచ్చే వేతనం నెలకు 6 వేలు అవికూడా ఇవ్వలేని స్థితిలో ముఖ్యమంత్రి , ప్రభుత్వం ఉన్నాదా అని నిలదీశారు .. ఈ ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు పెంచుతామని , దినికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని కార్మికులకు సిఐటియు అండగా ఉండి సమస్యలను పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తామని ఆయన తెలిపారు…
ఆందోళన లో యూనియన్ నాయకులు మాగులూరి దానయ్య , చవలం గంగయ్య , అలూరి ఇస్మాయిల్ , చలమయ్య , గుంటు బాల గురవయ్య , కోటయ్య , రాచపూడి ఎజ్జెర్ , రూతమ్మ , తిరపతమ్మ , లక్ష్మమ్మ , ఆనోక్ , రామస్వామి నాయకత్వం వహించారు.


