టీటీడీ పాలకమండలిసభ్యునిగా శిద్దా సుధీర్ కుమార్ – హర్షం వ్యక్తం చేస్తున్న శిద్దా అభిమానులు

తిరుమల తిరుపతి (టీటీడీ) దేవస్థానం పాలకమం డలి సభ్యునిగా వైఎ స్సార్ సీపీ నాయకుడు, మాజీ మంత్రి శిద్దా రాఘవరావు కుమారుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త శిద్దా వీర వెంకట శిద్దా సుధీర్ కుమార్ నియమితులయ్యారు. ఒంగో లుకు చెందిన శిద్దా సుధీర్ 1981 జూన్ 10వ తేదీ జన్మించారు. మద్రాస్ యూనివర్శిటీ నుంచి మేనే జ్మెంట్లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు. తమ వ్యాపారాల్లో ప్రధానమైన గ్రానైట్ పరిశ్రమపై ప్రత్యేక దృష్టి సారించి గ్రానైట్ ఎగుమతి వ్యాపారాన్ని విస్తృతం చేశారు. కస్టమర్ ఎక్సలెన్సీ రంగంలోనూ మంచి పట్టు సాధించారు. కరోనా సమయంలో క్వార్ట్జ్ రాళ్ల ఎగుమతికి సంబంధించి తీవ్ర సంక్షోభం ఏర్పడిన నేపథ్యంలో సాహసో పేతంగా క్వారట్జ్ రాళ్ల వెలికితీతలో స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ టెక్నాలజీ సౌకర్యాల ఏర్పాటు, సిబ్బందికి శిక్షణ ఇప్పించారు. తమ సంస్థ అయిన జ్యోతి గ్రానైట్ అధినేతగా వ్యవహరిస్తూ అత్యంత విజయవంతంగా నడిపించారు. రాజకీయాల్లోనూ తండ్రికి తగిన తనయునిగా రాణిస్తు న్నారు. వైఎస్సార్ సీపీలో యువనాయకునిగానే కాకుండా ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ రాష్ట్ర డైరెక్ట ర్ గా కొనసాగుతున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించడంతో పాటు ఆర్థికసాయం అందించడంలోనూ పెద్ద మనసుతో వ్యవహరిస్తు న్నారు. లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గా విశేష సేవలందిస్తూ చిన్నారుల్లో క్రీడా నైపుణ్యాన్ని పెంచాలనే ఉద్దేశంతో ఏకంగా లార్డ్ కృష్ణ షటిల్ అకాడమీని ప్రారంభించారు. దాని ద్వారా అనేకమంది షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారులను తయారు చేసి జాతీయ స్థాయి పోటీలకు సైతం పంపించారు. ప్రస్తుతం టీటీడీ పాలకమండలి సభ్యునిగా సుధీర్ కుమార్ ఎన్నికవడంతో శిద్దా అభిమానులు ఒంగోలులోని వారి నివాసం వద్ద బాణసంచా పేల్చి ఆనందం వ్యక్తం చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *