స్వచ్ఛభారత్ కార్మికులలోగడ బకాయి జీతాలు వెంటనే విడుదల చేయాలని కార్మికులు తాళ్లూరు లో ఎంపీడీవో కార్యాలయం ఎదురు ధర్నా నిర్వహించారు. కార్మిక సంఘాల మద్దతుతో స్వచ్ఛభారత్ కార్మికులకు గత 10- 15 నెలల నుండి రావలసిన జీతాల బకాయిలు వెంటనే విడుదల చేయాలని, స్వచ్ఛ భారత్ కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని నినాదాలు చేస్తూ ….కార్మికులు ధర్నా నిర్వహించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయ పర్యవేక్షకులు (ఎస్ఓ) శ్రీనివాసరావుకు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో స్వచ్ఛభారత్ కార్మిక నాయకులు, కార్మిక సంఘాల నాయకులు, ఇతర కార్మికులు పాల్గొన్నారు.

