జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ జన్మదిన వేడుకలను శనివారం చీమకుర్తిలోని వారి నివాసంలో ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో అభిమానులు, పార్టీ నేతల ఆధ్వ ర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. జెడ్పీ ఛైర్మన్ కు సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు స్థానిక బూచేపల్లి పార్కు వద్ద పుష్పగుచ్చం అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక జిల్లా పరిషత్ బాలికల హైస్కూల్లో విద్యార్థినులు, కుమారుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డితో కలిసి బూచేపల్లి వెంకాయమ్మ కేక్ కట్ చేశారు. జెడ్పీటీసీ సభ్యుడు వేమా శ్రీనివాసరావు ఆధ్వ ర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బాలికలకు స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా బాలికలు, టీచర్లు, స్థానిక నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. తొలుత బూచేపల్లి నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి కేక్ కట్ చేశారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్య కర్తలు, అభిమానులు గజమాలలతో ఘనంగా సత్కరించారు. బూచేపల్లి పార్కులో మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి, బూచేపల్లి కమలా కర్ రెడ్డి స్మారకాల వద్ద జెడ్పీ చైర్పర్సన్ నివాళులర్పించారు. పేదలకు అన్నదానం చేశారు. కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ చల్లా అంకులు, వై. జనార్దన్ రెడ్డి, పులి వెంకటరెడ్డి, కౌన్సిలర్లు కంజుల ప్రతాప్ రెడ్డి, తప్పెట బాబూరావు, గోపురపు చంద్ర, పలువురు నాయకులు, కార్యక ర్తలు, అభిమానులు పాల్గొన్నారు.














