దర్శి పట్టణంలో శనివారం బూచేపల్లి అభిమానులు జెడ్పి చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ జన్మదిన వేడుకలను గడియారస్తంభం సెంటర్లో ఘనంగా నిర్వహించారు. బర్త్ డే కేక్ కట్ చేసి, జెడ్పి చైర్మన్ కు శుభాకాంక్షలు తెలిపారు. అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే కాశీనాయనఅనాధవృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. రాష్ట్ర షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ఎం భాషా, మాజీ ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు.

