సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దానం నాగేందర్ ను భారీ మెజార్టీ తో గెలిపించాలని కోరుతూ సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,మాజీ ఏ బ్లాక్ ,బిబ్లాక్ అధ్యక్షులు మైనార్టీ నేత షేక్ గౌస్ ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికీ తిరిగి ఓటర్లను దానం కు ఓట్లు వేయాలని కోరారు.ఇంటింటికీ కాంగ్రెస్ పార్టీ స్టిక్కర్ లు అంటించారు. ఈ సందర్భంగా గౌస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రాధాన్యత క్రమంలో అమలు చేస్తుందన్నారు.మహిళలకు ఉచిత ఆర్టీసి బస్సు ప్రయాణం.500 కి గ్యాస్ సిలిండర్ అందజేత.200యూనిట్ల ఉచిత కరెంటు ఇలా ప్రతి ఒక్క హామీ నీ అమలు చేస్తోందన్నారు.సికింద్రబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి,బీ జె పీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నియోజక వర్గాన్ని పూర్తిగా విస్మ రించారని.మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టి కొత్త హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెడుతున్నారని.సికింద్రబాద్ పార్లమెంట్ నియోజక వర్గంలో అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి దానం నాగేందర్ నీ భారీ మెజార్టీ తో గెలిపించాలని గౌస్ ప్రజలను కోరారు.
