సేవకులుగా పనిచేస్తాం.. జగన్ సిఎం అయితేనే సంక్షేమం, అభివృద్ధి-వైసిపి దర్శి అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి

భవిష్యత్తులోనూ దర్శి నియో జకవర్గానికి సేవకులుగా పని చేస్తామని వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్దొడ్డి పేర్కొ న్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి మరలా ముఖ్యమంత్రి అయితేనే సంక్షేమం, అభివద్ధి జరుగుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. సోమవారం తాళ్లూరు మండలంలోనిశివరాంపురం, కొర్రపాటివారిపాలెం, తాళ్లూరు, కొత్తపాలెంగ్రామాలలో జిల్లా పరిషత్చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, నందినిలతో కలిసి మన ఊరికి మన శివన్న కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో ప్రజలు బూచేపల్లికి ఘన స్వాగతం పలికారు. గజమాలతో సత్కరించి పూలు చల్లుతూ హారతులు పట్టారు. ఈ సందర్భంగా డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ పేద ప్రజలందరి కోసం నవరత్నాలు పెట్టి నేరుగా లబ్ధిదారులకు నేరుగా అందించిన ఘనత వైసీపీకే తగ్గిందన్నారు.
మండలంలో మొగులుగుండాల రిజర్వాయర్వెను పూర్తి చేసి సాగు, తాగునీరందిస్తామన్నారు. ఎన్నికల్లో -ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనను, -ఒంగోలు పార్లమెంటు -అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. కార్యక్రమంలో పార్టీ బాధ్యులు, ప్రజా ప్రతినిధులు గ్రామస్థాయి నాయకులు మహిళలు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *