దర్శి జర్నలిస్ట్ గురుకాంతాచారి తో జిల్లా ఎన్నికల అధికారి ఏ ఎస్ దినేష్ కుమార్ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మీరు ఓటు హక్కు వినియోగించుకున్నారా అని అడిగారు. ఓటు హక్కు వినియోగించుకునే టప్పుడు అధికారులు వేలికి వేసే ఇంకు గురించి జిల్లా కలెక్టర్ కు తెలియజేశారు. ఇంకు వేలికి త్వరగా పోతుందని తెలిపారు. ఎన్నికలు కమీషన్ పాసులు ఇచ్చిన జర్నలిస్ట్ లను గేట్ బయటే ఉంచుతున్నారని లోపలికి వెళ్ళనివ్వడం లేదని తెలపడంతో కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ తక్షణమే స్పందించి ఆర్వో లోకేశ్వరరావ్ కి దర్శి ఎస్ఐ సుమన్ కి ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి పాసులు ఉన్న వారిని లోపలికి వెళ్ళనివ్వాలని వారికి తెలియజేశారు. దర్శి లో 1575 మంది పోస్టల్ బ్యాలెట్ కోసం అప్లై చేసుకోవడం జరిగిందని ఈరోజు 65 % దర్శి లో పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు వినియోగించు కున్నారని జిల్లా కలెక్టర్ తెలియజేసారు.


