సికింద్రాబాద్ పార్లమెంట్ లో అభివృద్ధి జరగాలంటే బీ ఆర్ ఎస్ గెలుపు తోనే సాధ్యమని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బన్సీలాల్ పేట డివిజన్ భోలక్ పూర్ లో సికింద్రాబాద్ పార్లమెంట్ బీ ఆర్ ఎస్ పార్టీ అభ్యర్ధి పద్మారావు గౌడ్ తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. భోలక్ పూర్ లోని మల్లన్న దేవాలయం వద్ద నుంచి ప్రచారాన్ని ప్రారంభించారు ర్యాలీ
కృష్ణా నగర్ కాలనీ, ఆంజనేయస్వామి కాలనీ, ఐ డి హెచ్ కాలనీ, గొల్ల కొమరయ్య కాలనీ తదితర ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పద్మరావు గౌడ్ ,శ్రీనివాస్ యాదవ్ లకు స్థానిక మహిళలు మంగళ హారతులు, బోనాలతో ఘన స్వాగతం పలికారు. దారి పొడవునా పూలమాలలు, శాలువాలతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఐ డి హెచ్ కాలనీలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానికులు భవనాల పై నుండి పూల వర్షం కురిపించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రజలు కోరుకునేది అభివృద్ధి, సమస్యల పరిష్కారమేనని అది బీ ఆర్ ఎస్ పార్టీతోనే సాధ్యమనే విశ్వాసంతో ఉన్నారని పేర్కొన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్, బీ జె పీ పార్టీలు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయని చెప్పారు. అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి, హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. అదేవిధంగా సికింద్రాబాద్ పార్లమెంట్ నుండి ఎమ్ పి గా గెలిచి కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకుండా, ప్రజలకు అందుబాటులో లేకుండా
ఈ నియోజకవర్గ ప్రజల నమ్మకాన్ని కోల్పోయారని విమర్శించారు. తెలంగాణా రాష్ట్రం వచ్చిన తర్వాతనే
కే సి ఆర్ నాయకత్వంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేశామని, అభివృద్ధి అంటే ఏమిటో చూపించామని గుర్తు చేశారు. ప్రజలు కూడా అభివృద్దిని కోరుకుంటున్నారని, అసెంబ్లీ ఎన్నికలలో అభివృద్ధి కోసం కృషి చేస్తున్న బీ ఆర్ ఎస్ పార్టీని అత్యధిక స్థానాలలో గెలిపించి బ్రహ్మరధం పట్టారని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికలలో కూడా ప్రజలు
బీ ఆర్ ఎస్ పార్టీ అభ్యర్ధి పద్మారావు గౌడ్ ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని చెప్పారు. ప్రచారంలో నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జి వెంకట్ రెడ్డి, కార్పొరేటర్ కుర్మ హేమలత లక్ష్మీపతి, డివిజన్ బీ ఆర్ ఎస్ అద్యక్షులు వెంకటేషన్ రాజు, పద్మారావు నగర్ ఇంచార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్, నాయకులు ఏసూరి మహేష్, శ్రీకాంత్ రెడ్డి, ప్రేమ్, పుష్యంత్ రెడ్డి, వెంకట్, సుధాకర్ రెడ్డి, రమణ, మహేందర్, ముక్కా శ్రీనివాస్, అబ్బాస్, మనీష్ తదితరులు పాల్గొన్నారు.






