మల్కాజ్ గిరీ పార్లమెంట్ లో అభివృద్ధి జరగాలంటే బీ ఆర్ ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి నీ భారీ మెజార్టీ తో గెలిపించాలని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిలుపు ఇచ్చారు.మంగళవారం *ఎమ్మేల్యే మాధవరం కృష్ణా రావు , బేగంపేట్ కార్పొరేటర్ మహేశ్వరి శ్రీహరి తో కలసి బేగంపేట్ డివిజన్ లో నీ చికోటి గార్డెన్ పార్క్ లో వాకర్లు, ముఖ్య నాయకులతో మల్కాజిగిరి బి.ఆర్.ఎస్. పార్టీ యం.పి. అభ్యర్థి రాగిడి లక్ష్మా రెడ్డి గెలుపు కోసం ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ బీ ఆర్ ఎస్ ప్రభుత్వం హయం లో రాష్ట్రం ఎంతో అభి వృద్ది చెందిందని అన్నారు.మల్కాజ్ గిరి పార్లమెంట్ నుంచి బీ ఆర్ ఎస్ అభ్యర్థిగా బరిలో వున్న లక్ష్మారెడ్డి నీ భారీ మెజార్టీ తో గెలిపించాలని, ఈ కొద్ది సమయం లో ప్రతి ఒక్కరూ కారు గుర్తు పైన ఓట్లేసి గెలిపించ వల్సింది గా ఓటర్లను.కోరారు.
ఈ కార్యక్రమం లో కార్పొరేటర్ టి.మహేశ్వరి,పొన్న బోయిన సురేష్ యాదవ్ ,శ్రీహరి.డివిజన్ ప్రధాన కార్యదర్శి నరేష్, ఇన్చార్జి రాధాకృష్ణ , సీనియర్ నాయకులు నాగు రఘునాథ్ , సి.సత్యనారాయణ , మాజీ మైనార్టీ అధ్యక్షుడు జాంగిర్ బాబా , మరియు బీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.



