రాహుల్ ,ప్రియాంకా గాంధీ సేన (కాంగ్రెస్) రాష్ట్ర మైనార్టీ విభాగం అధ్యక్షులు గా మహమ్మద్ ఫయాజ్.కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థుల విజయం కోసం కృషి చేస్తా….మహమ్మద్ ఫయాజ్.

రాష్ట్రంలో త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేస్తున్న అభ్యర్థుల విజయానికి కృషి చేస్తానని,రాహుల్,ప్రియాంకా గాంధీ సేన (కాంగ్రెస్) రాష్ట్ర మైనార్టీ విభాగం అధ్యక్షులు మహమ్మద్ ఫయాజ్ అన్నారు.ఫయాజ్ నీ రాష్ట్ర మైనార్టీ విభాగం అధ్యక్షులు గా ఎంపిక చేసిన సందర్భంగా పలువురు కాంగ్రెస్ నేతలు ఆయన్ని పూలమాలలు.శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మహమ్మద్ ఫయాజ్ మాట్లాడుతూ తనపైన నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని అన్నారు.కేంద్ర,రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వానికి కూడా ఆయన కృతజ్ఞతలు తెలియ జేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీ తరుపున పార్లమెంట్ స్థానాలలో పోటీలలో వున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తానని ఆయన చెప్పారు.ఈ సందర్భంగా పాటిగడ్డ లో నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు.అనంతరం సికింద్రబాద్ పార్లమెంట్ నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేస్తున్న దానం నాగేందర్ కు మద్దతుగా ఎన్ బీ టీ నగర్,పాటుగడ్డ లలో వారు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఫయాజ్ ను సత్కరించిన వారిలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కుమార్, మల్లు శివరామ్, సికింద్రాబాదు ఇంఛార్జి సంపత్ కుమార్,సనత్ నగర్ నియోజక వర్గం ఏ బ్లాక్,బీ బ్లాక్ మాజీ అధ్యక్షులు షేక్ గౌస్,సలీం ఖాన్,మహమ్మద్ అశ్లాం,నాగేందర్ రాజు,ఇబ్రహీం పటేల్,కల్పన,రామ్, మల్లు మదు,డాక్టర్ అహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *