బేగంపేట డివిజన్ మోతి లాల్ నెహ్రూ నగర్ రెసిడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గౌర శ్రీనివాస్,విశాల్ సుధామ లు ఆధ్వర్యం లో సమావేశం ఏర్పాటు చేసారు .ఈ సమావేశానికి సనత్ నగర్ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి దా.కోట నీలిమ హాజరయ్యారు .ఈ సందర్భంగా కాలనీలో రోడ్ల సౌకర్యం లేక పోవడం,మౌలిక వసతులు సరిగా లేక పోవడం పై కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు.అలాగే జాలనే పరిధిలో వున్న పార్కులా సుందరీకరణ చేయాలని స్థానికులు నీలిమ కు వివరించారు .అలాగే కమర్షియల్ జోన్ ఫ్రీ ఏరియగా కాలనీ వుండేలా చూడాలి అని వారు ఆమె దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా కోట నీలిమ మాట్లాడుతూ తన దృష్టికి వచ్చిన అన్ని సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు.ఈ సమావేశం లో మోతీలాల్ నెహ్రూ నగర్ రెసిడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గౌర శ్రీనివాస్,కాంగ్రెస్ సీనియర్ నాయకులు విశాల్ సుధామ,చంద్రశేఖర్,శ్రీశైలం,శ్రీనివాస్ పటేల్,రూపల్ షా కాలనీ వాసులు పాల్గొన్నారు.
