ముండ్లమూరు మండలం ఎస్సైగా వి. నాగమల్లేశ్వరరావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఒంగోలు మహిళా పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఇక్కడ పనిచేస్తున్న ఆంజనేయులు సెలవుపై వెళ్లారు. శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని ఎస్సై తెలిపారు. అనంతరం పోలీస్ సిబ్బంది ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
