హైదరాబాద్ జిల్లా పరిధిలోని బడ్జెట్ స్కూల్స్ ఎదుర్కొంటున్న సమస్యలను ట్రెష్మా ప్రతినిధులు సోమవారం కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిసి సమస్యలు వివరించారు. పేద మధ్యతరగతి వర్గాల విద్యార్థులకు ఉన్నత స్థాయిలో విద్యను అందిస్తూ అతి తక్కువ ఫీజులు వసూలు చేస్తున్న బడ్జెట్ స్కూల్స్ ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాయని కేంద్ర ప్రభుత్వం తరఫున తమకు అండగా ఉండాలని ట్రెస్మ హైదరాబాద్ జిల్లా ప్రెసిడెంట్ ఉమామహేశ్వర రావు కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి వివరించారు.ఈ కార్యక్రమం లో పవన్ పాఠక్ తో పాటు ట్రేస్మా సభ్యులు వున్నారు.

