రైతు బాంధవుడు, పేదల పెన్నిది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను దర్శి నియోజక వర్గంలో వైఎస్సార్సీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. దివంగత సీఎం వైఎస్సార్ విగ్రహాలకు, చిత్ర పటాలకు పూల మాలలు వేసి నివాళులు ఆర్పించారు. దర్శి పట్టణంలో, తూర్పుగంగవరంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డిని పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ…. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనకు ప్రొత్సహించి ఎమ్మెల్యేగా పోటీ చెయ్యాలని సూచించారని అన్నారు. నాన్న గారు దివంగత ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి తోనే నాటి సీఎం రాజశేఖర్ రెడ్డి రాబోవు ఎన్నికలలో శివను ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉంచుదామని చెప్పారని అన్నారు. ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మైనార్టీ, పేద, బడుగు, బలహీన వర్గాలకు ఎంతో సేవ చేసారని .. వారి కుటుంబంతో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయా కార్యక్రమాలలో ఆయా మండల పార్టీ అధ్యక్షుడు, జెసీఎస్ కన్వినర్లు, | ప్రజా ప్రతినిథులు, పార్టీ బాధ్యులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.















