నువ్వుల్లో ఆరుతడి పంటగా నువ్వులు సాగు చేసి దిగుబడులు పెంచాలని వ్యవసాయాధికారి ప్రసాద రావు అన్నారు. తాళ్లూరులో గురువారం పొలం బడి నిర్వహించారు. వేసవిలో సాగు చేసిన నువ్వులు చీడ పీడలకు బేడత తక్కువగా ఉంటుందని అన్నారు. నువ్వులలో మొక్కలు మొలిచిన 15 రోజుల తర్వాత అదనపు మొక్కలను తీసివెయ్యాలని, 25 రోజుల తర్వాత గొర్రుతో అంతర కృషి చెయ్యాలని కోరారు. ఎండలు ముదురు తున్నందున నీటి తడులు అందించాలని చెప్పారు. విత్తిన 35 – 40 రోజులకు, 65-70 రోజులకు నీటి ఎద్దడి లేకుండా చూడాలని తద్వార దిగుబడులు పెరుగుతాయని అన్నారు. విఏఏ వెంకట రావు తదితరులు పాల్గొన్నారు.
