వైసిపి జిల్లా అధ్యక్షుడు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ను ఆ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోశం మధుసూదన్ రెడ్డి మంగళవారం గజమాలతో ఘనంగా సన్మానించారు. రాష్ట్ర పార్టీ సంయుక్త కార్యదర్శిగా ఎంపికకు తనను ప్రతిపాదించినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. వారి బాటలో పార్టీ అభ్యున్నతికి సర్వశక్తుల కృషి చేస్తానని తెలిపారు. ఆయనతో పాటు పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.

