విజయవంతంగా మెగా వైద్యశిబిరం – సీఎం చంద్రబాబు జన్మదినంగా సందర్భంగా ముందస్తుగా టిడిపి ఆధ్వర్యంలో తాళ్లూరు ఎబీన్ హైస్కూల్లో ఉచిత మెగావైద్యశిబిరం

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురష్కరించుకుని తాళ్లూరు టిడిపి యువనాయకుడు ఎడమకంటి శ్రీనివాస రెడ్డి జ్ఞాపకార్థం కిమ్స్, మోడరన్ ఐ హాస్పటల్ సౌజన్యంతో తాళ్లూరు ఎబీన్ ఉన్నత పాఠశాలలో ఆదివారం నిర్వహించిన ఉచిత మెగా వైద్యశిబిరం విజయవంతమైనది. కార్యక్రమాన్ని దర్శి టిడిపి నియోజక వర్గ ఇన్చార్జి ప్రధాన నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ ముఖ్య అతిధులుగా పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. ఉచిత మెగా వైద్యశిబిరం నేటి కాలంలో ప్రజలకు మంచి ఉపయోగకరమని అన్నారు. అధిక సంఖ్యలో వైద్య నిపుణులు ఓక చోటకు వచ్చి ప్రజలకు సేవ చేయటం అభినందనీయమని, అలా ఏర్పాటు చేసిన నిర్వాహకులు మాజీ నర్పంచి ఇడమకంటి రమణా రెడ్డి, కార్యనిర్వాహకులు ఇడమకంటి సుబ్బా రెడ్డి, టిడిపి నాయకులను అభినందించారు. శిబిరంలో కిమ్స్ ప్రత్యేక వైద్య బృందం జనరల్ మెడిసిన్ డాక్టర్ శ్రీహరి రెడ్డి, కిడ్నీ వైద్యనిపుణులు డాక్టర్ టివి రమణా రెడ్డి, ల్యాపరో స్కోపిక్ జనరల్ సర్జన్ డాక్టర్ పెరుమాళ్ల కార్తీక్ బాబు, మొదడు మరియు నరాల వైద్యనిపుణులు ఎం నిశ్చల్ రెడ్డి,స్త్రీలు మరియు ప్రసూతి వైద్య నిపుణులు డాక్టర్ సుంకర సుజని, ఎముకలు కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ ఐవీ రెడ్డి, క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ నారు రమణా రెడ్డి, వినయ్ చర్మవ్యాధి నిపుణులు డాక్టర్ వినయ్ కుమార్ రెడ్డి, గౌతమి డెంటల్ వైద్యనిపుణులు డాక్టర్ తిరుమల రెడ్డి, మోడరన్ కంటి వైద్యనిపుణులు డాక్టర్ మారం వెంకట రమణా రెడ్డి, తదితరులు పాల్గొని 591 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఈసీజీ, రక్త పరీక్షలు, బీపీ పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు పంపిణీ చేసారు. కార్యక్రమంలో టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వర రెడ్డి, తాళ్లూరు ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, ఇడమకంటి రమణా రెడ్డి, సుబ్బా రెడ్డి, తూము శివ నాగి రెడ్డి, విజయ, పేద కాలేషా, వలి(బడే), రామ కోటి రెడ్డి, వల్లభనేని సుబ్బయ్య, యలమందా రావు, రామయ్య, గొల్లపూడి వేణుబాబు, వలి తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ లలిత్ సాగర్ తనకు డాక్టర్ కార్తీక్ బాబుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అనంతరం డాక్టర్ల బృందం, ఎబీసీ యాజమాన్యం కరస్పాండెంట్ టి శ్రీనివాస రెడ్డి, ప్రిన్సిపాల్ వెంకటేశ్వర రావు, డైరెక్టర్ కాలేషా బాబులు డాక్టర్ లలిత్ సాగర్ను సన్మానించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *