బేగంపేట, మే 15,
(జే ఎస్ డి ఎం న్యూస్) :
బేగంపేట డివిజన్ ఓల్డ్ కస్టమ్స్ బస్తీ లోని షెల్టర్ ఫర్ అర్బన్ హోమ్ లెస్ వద్ద కాంగ్రెస్ సీనియర్ నాయకులు విశాల్ సుధాం ఆధ్వర్యంలో పేదలకు ఆహారం పంపిణీ చేశారు.సనత్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డా.కోట నీలిమ జన్మ దినోత్సవం సందర్భంగా విశాల్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా విశాల్ సుదామ్ మాట్లాడుతూ డా. కోట నీలిమ ఎల్లప్పుడూ ప్రజాసేవ మరియు సామాజిక సేవకు కట్టుబడి పనిచేస్తున్న నాయకురాలని అన్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారానే జన్మదిన వేడుకలను నిర్వహించడం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతానికి నిజమైన నిదర్శనమని పేర్కొన్నారు.సనత్ నగర్ నియోజక వర్గంలోని బేగంపేట డివిజన్ లో సమస్యల పరిష్కారానికి తాను కృషి చేస్తానన్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రాజేందర్ ముదిరాజ్ ,నసీర్ (అడ్డూ), మునీర్ ఖాన్, సిద్ధిఖ్, చిరంజీవి, కృష్ణ, రాధ, చంద్రకళ, తస్లీమ్, మయీద్, అఫ్సర్ తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానికులు పాల్గొన్నారు.


