హైదరాబాద్, మే 19,(జే ఎస్ డి ఎం న్యూస్) :
రాంగోపాల్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2019లో 11 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడికి పాల్పడిన ఆటో డ్రైవర్ అబ్దుల్ రెహమాన్‌కు హైదరాబాద్ ఫోక్సో ప్రత్యేక కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. రూ.6 వేల జరిమానాతో పాటు బాధిత బాలుడికి రూ.75 వేల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది.రాంగోపాల్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో బాలుడిని ఆటోలో తీసుకెళ్లిన నిందితుడు రైల్వే ట్రాక్ పక్కనున్న పొదల్లోకి లాగి దారుణానికి పాల్పడ్డాడు. బాలుడు ప్రతిఘటించడంతో అతడిపై దాడి చేశాడు. బాలుడి అరుపులు విన్న స్థానికులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.కేసులో పక్కా ఆధారాలు సమర్పించిన దర్యాప్తు అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లను సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి అభినందించారు.
11 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి.. ఆటో డ్రైవర్‌కు 20 ఏళ్ల జైలు
19
May