కుల గణన పై సుప్రీం కోర్టు తీర్పు స్వాగతిస్తున్నాం – మంత్రి పొన్నం ప్రభాకర్.

హైదరాబాద్, మే 20,
(జే ఎస్ డి ఎం న్యూస్) :
జన గణన లో కుల గణన లెక్కింపుకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పట్ల రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కుల గణన నిర్వహించి ఎవరెంతో వారికంతా అనే సామాజిక న్యాయం తో ముందుకు పోతుందని తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన మాదిరి దేశ వ్యాప్తంగా కుల గణన నిర్వహించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారని తెలిపారు. జన గణన లో కుల గణన చేస్తామని గతంలో కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చి తరువాత కాలం 13 లో బీసీ ల అంశం చేర్చలేదని ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన లో కాలం 13 లో ఎస్సీ ఎస్టీ లతో పాటు బీసీ గణన లెక్కించాలని కోరామని గుర్తు చేశారు. కుల గణన వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ సుప్రీం కోర్టు కొట్టివేయడం సామాజి న్యాయానికి బలాన్నిచ్చేది గా ఉందన్నారు. జన గణన లో కుల గణన లెక్కిస్తే సామాజిక న్యాయం జరుగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. కుల గణన ద్వారా కచ్చితమైన లెక్కలున్నప్పుడే బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. ప్రజా పాలన ప్రభుత్వం లో బలహీన వర్గాలకు న్యాయం చేయడానికి కుల గణన నిర్వహించి బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ల చేయడానికి చట్టం చేశామని ఆ బిల్లు రాష్ట్రపతి గారి వద్ద పెండింగ్ లో ఉందని కేంద్ర ప్రభుత్వం బిల్లు ఆమోదింప చేయాలని డిమాండ్ చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *