ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే ప్రతి సమస్యను క్షేత్రస్థాయిలో పరిష్కరించడమే ముఖ్య ఉద్దేశమని జిల్లా కలెక్టర్ పి. రాజబాబు పేర్కొన్నారు.
ముండ్లమూరు మండల పరిషత్ కార్యాలయంలో ఆవరణలో శుక్రవారం దర్శి నియోజకవర్గ స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నియోజకవర్గ ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మీతో కలిసి జిల్లా కలెక్టర్ పీ.రాజా బాబు
నియోజకవర్గ స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమ అనంతరం జిల్లా కలెక్టర్ పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని చెప్పారు అందుకు అనుగుణంగా నియోజకవర్గంలో ఒక్కొక్క మండలంలో ప్రజా స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సుమారు 176 పైచిలుకు అర్జీలు అందాయన్నారు. అందులో రెవెన్యూ 127 కాగా పంచాయితీ రాజ్-8, డిఆర్డిఏ-6, ఆర్డబ్ల్యూఎస్-6 ఇతర శాఖలకు సంబంధించినవి వచ్చాయన్నారు. దర్శి నియోజకవర్గ స్థాయిలో సమస్యలను పరిష్కరించడమే ముఖ్య ఉద్దేశం అన్నారు. అందిన అర్జీలను మండల రెవెన్యూ అధికారులు మండల పరిషత్ అధికారులు ఆయా శాఖల జిల్లా అధికారులకు పంపడం జరిగిందని అర్జీదారుని ఇంటికి వెళ్లి సమస్య గురించి అడిగి తెలుసుకొని దానిని అర్జీ దారుని సంతృప్తి స్థాయిలో పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అర్జీదారులతో మాట్లాడి సమస్య వివరాలను తెలుసుకోవడం జరుగుతుంది అని దానిని ఆయా శాఖల జిల్లా అధికారులు జిల్లా యంత్రాంగం తగిన పూర్తి పరిష్కారం చూపుతారు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహించడం జరుగుతుందని అన్నారు. వచ్చిన అర్జీలలో ఎక్కువ శాతం రెవెన్యూ సంబంధితమైన ఉన్నాయని, ఆర్థికేతర సమస్యలు ఆర్థిక సమస్యలు తో అర్జీలు వచ్చాయని అందులో ఆర్థికేతర సమస్యలున్న అర్జీలను పరిష్కారానికి ఆదేశించడం జరిగిందన్నారు. ఆర్థిక సంబంధిత విషయాలను ఆయా శాఖలు తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. రెవిన్యూ సంబంధిత అంశాలను కొంత నిర్దిష్ట కాలం లోపల పూర్తి చేయడం జరుగుతుందన్నారు. పెద్ద పెద్దపెద్ద సమస్యలు ఉన్న అర్జీలు 66 దాకా వచ్చాయని వాటిని పూర్తి స్తాయిలో పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈరోజు సాయంత్రం మారేళ్ల లో పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించి స్థానిక సమస్యలను తెలుసుకోవడం జరుగుతుందన్నారు.



జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఎక్కువ శాతం రెవిన్యూ మరియు భూములు రీ సర్వే కి సంబంధించిన ఉన్నాయని అదేవిధంగా డి లిమిటేషన్ పై అప్లికేషన్ అందాయని ఆమె తెలిపారు.


దర్శి నియోజకవర్గ ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మీ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారo విషయంలో జిల్లా కలెక్టర్ పి. రాజబాబు, జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారి ప్రత్యేక శ్రద్ధ చూపించడంతోపాటు వేగవంతంగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నారని అదేవిధంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సమస్యలు పరిష్కరిస్తున్నారని ఆమె తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎక్కువ శాతం రెవెన్యూ సంబంధిత అంశాలతో పాటు ఎప్పటినుంచో పెండింగ్ లో ఉన్న పలు అంశాలు అర్జీలు అందాయని వాటిని కూడా వీలైనంత త్వరలో పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
కార్యక్రమంలో రెవిన్యూ డివిజనల్ అధికారి విజయ జ్యోతి, జడ్పీ సీఈవో చిరంజీవి, డిపిఓ అనుపమ, బీసీ సంక్షేమ శాఖ అధికారి వెంకటేశ్వర్లు, ఎస్సీ సంక్షేమ అధికారి లక్ష్మా నాయక్ , ఐసిడిఎస్ వేడి పి. డి సునంద , ఇంటర్మీడియట్ బోర్డు ఆర్ ఐ ఓ కొండపల్లి ఆంజనేయులు , రజిని కుమార్ తహసిల్దార్ రజనీకుమారి తో పాటు 4 మండలాల తహసిల్దార్ లు, ముండ్లమూరు ఎంపీడీవో శ్రీదేవితో పాటు నియోజకవర్గ ఎంపీడీవోలు, ఆయా మండలాల ఏపీవోలు ఏపీఎంలు వ్యవసాయ శాఖ ఏవోలు మరియు వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
